OTT Weekend Special: “లవ్, వివక్ష, మానవత్వం”.. ఓటీటీలో సోషల్ మెసేజ్ సినిమాల హవా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Weekend Special: “లవ్, వివక్ష, మానవత్వం”.. ఓటీటీలో సోషల్ మెసేజ్ సినిమాల హవా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ వీకెండ్‌ (2026 జనవరి రెండో వారంలోపు) ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రెండు కొత్త సినిమాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. తమిళం, మలయాళం భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న చిత్రాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. లవ్, ఫ్యామిలీ డ్రామా నుంచి సోషల్ మెసేజ్‌తో కూడిన కథల వరకు విభిన్న జానర్లలో ఈ సినిమాలు ఉండటంతో ఓటీటీ వీక్షకులకు ఇది ప్రత్యేక వీకెండ్‌గా మారింది. ఈ రెండు చిత్రాలు తమ థియేట్రికల్ రన్‌లో కూడా పాజిటివ్ టాక్ అందుకుని, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో మరింత విస్తృత ప్రేక్షకులకు చేరువవుతున్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘అంగమ్మాల్’(తమిళం), మరొకటి ‘పెంగలిలా’(మలయాళం). 

యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ అంగమ్మాల్‌ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తమిళ ప్రముఖ డైరెక్టర్ కె.బాలచందర్‌ కోడలైన గీత కైలాసం ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. గ్రామీణ కథతో తెరకెక్కిన ఈ మూవీ 2025 నవంబర్ 21 థియేటర్లలో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇప్పుడు జనవరి 9 నుంచి ఓటీటీలో ప్రసారం అవుతుంది.  అలాగే, మరో మూవీపెంగలిలా. ఇది మలయాళంలో తెరకెక్కి సూపర్ సక్సెస్ అందుకుంది.ఈ సినిమాలు ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి? వాటి కథలు ఏమిటి? నటీనటులు ఎవరు? అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం.

టైటిల్ : అంగమ్మాల్ (తమిళం)
ప్లాట్​ ఫాం : సన్​నెక్స్ట్‌‌‌‌‌‌‌‌,
డైరెక్షన్ : విపిన్ రాధాకృష్ణన్,
కాస్ట్​ : గీతా కైలాసం, భరణి, శరణ్ శక్తి, తెండ్రాల్ రఘునాథన్

కథేంటంటే:

ఈ కథ 1990ల నాటిది. తమిళనాడులోని పడ్మనేరి అనే చిన్న గ్రామంలో అంగమ్మాల్ (గీతా కైలాసం) ఉంటుంది. ఆమె వితంతువు. పాలు అమ్ముతూ పిల్లల్ని పోషించుకుంటుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు.. పెద్దవాడు సుదలై (భరణి), చిన్నవాడు పవళం (సరణ్ శక్తి). సుదలైకి భార్య శారద (తెండ్రల్ రఘునాథన్), ఒక కూతురు మంజు (యాస్మిన్) ఉంటారు. అంగమ్మాల్ లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్ చాలా డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. మోపెడ్ డ్రైవ్ చేస్తుంది. బీడీలు తాగుతుంది. తనకు నచ్చినట్టు బతుకుతుంది. 

►ALSO READ Mana Shankara Varaprasad Garu Business: చిరంజీవి కెరియర్లోనే భారీ బిజినెస్.. బాక్సాఫీస్ టార్గెట్ ఎన్ని కోట్లంటే?

ముఖ్యంగా, ఆమెకు బ్లౌజ్ వేసుకునే అలవాటు లేదు. ఊళ్లలో అది సాధారణమే. పవళం సిటీలో మెడిసిన్‌‌‌‌‌‌‌‌ చదివి ఊరికి తిరిగొస్తాడు. చదువుకుంటున్నప్పుడే జాస్మిన్ (ముల్లై అరసి) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెని, ఆమె పేరెంట్స్‌‌‌‌‌‌‌‌ని అంగమ్మాల్‌‌‌‌‌‌‌‌కు పరిచయం చేయాలి అనుకుంటాడు. కానీ.. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ వల్ల ఇబ్బందిపడతాడు. ఆమెను బ్లౌజ్ వేసుకోమని రిక్వెస్ట్ చేస్తాడు. ఆమె ఒప్పుకోదు. అందరూ ఒప్పించడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ.

వివక్ష ఎందుకు? 

టైటిల్ : పెంగలిలా (మలయాళ)
ప్లాట్​ ఫాం : నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌, మనోరమా మ్యాక్స్‌‌‌‌‌‌‌‌
డైరెక్షన్ :  టీవీ చంద్రన్ , కాస్ట్​ : అక్షర కిషోర్, నరైన్ కుమార్

కథేంటంటే:

ఎనిమిదేండ్ల మిడిల్ క్లాస్ అమ్మాయి రాధ (అక్షర కిషోర్) వాళ్ల ఫ్యామిలీ ముంబై నుంచి కేరళకు షిఫ్ట్ అవుతుంది. వాళ్ల ఇంటి పక్కన ఒక గుడిసెలో 60 ఏళ్ల అజ్గన్​(లాల్) ఉంటాడు. అతను దళితుడు. కూలీ పనులు చేస్తూ బతుకుతుంటాడు. అప్పుడప్పుడు రాధ వాళ్ల ఇంటి బ్యాక్‌‌‌‌‌‌‌‌యార్డ్ క్లీన్ చేయడానికి వెళ్తుంటాడు. అలా అతనికి రాధతో స్నేహం ఏర్పడుతుంది. రాధని చూస్తే తన చనిపోయిన చెల్లెలు గుర్తొస్తుంది. రాధ అజ్గన్ భుజంపై కూర్చుని ప్రపంచాన్ని చూస్తూ, ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది. కానీ.. రాధ, వాళ్ల అమ్మ (ఇనియా)కు అజ్గన్‌‌‌‌‌‌‌‌ దగ్గర కావడం రాధ తండ్రి (నారాయణ్)కి నచ్చదు. ఆ  తర్వాత ఏం జరిగిందో సినిమా చూసి తెలుసుకోవాలి.