
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం( SEC) సోమవారం( సెప్టెంబర్29) మొత్తం 31 జిల్లాల్లో 565 మండలాల్లో గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు తేదీలను ప్రకటించింది. రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు, మూడు విడతలుగా గ్రామపంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.
అక్టోబర్ 9 న ఎంపీటీసీలకు, జెడ్పీటీసీల ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 11న నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అక్టోంబర్ 23న, 27న రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల పోలింగ్ నిర్వహించునున్నారు. ఫలితాలు నవంబర్ 11న ప్రకటించడంతో ఎన్నికల ప్రక్రియ ముగుయనుంది.
మొదటి విడత..
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్11( సాయంత్రం 5 గంటల వరకు)
పరీశీలన: అక్టోబర్ 12( సాయంత్రం 5 గంటల వరకు)
నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 15( సాయంత్రం 3 గంటల లోపు)
రెండో విడత..
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్15( సాయంత్రం 5 గంటల వరకు)
పరీశీలన: అక్టోబర్ 16( సాయంత్రం 5 గంటల వరకు)
నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 19( సాయంత్రం 3 గంటల లోపు)
రెండు విడతలకు అక్టోబర్ 11న ఫలితాలు