సర్కార్ బడులు, టీచర్లు పెరిగినా.. పిల్లల అడ్మిషన్లు మాత్రం అంతంత మాత్రమే..

సర్కార్ బడులు, టీచర్లు పెరిగినా.. పిల్లల అడ్మిషన్లు మాత్రం అంతంత మాత్రమే..

యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ డేటా ప్రకారం, తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ సంఖ్య బాగా పెరిగి ఎనిమిది ఏళ్లలో అత్యధికంగా 30 వేల 057కి చేరుకుంది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని విద్యా మంత్రిత్వ శాఖ, స్కూల్ విద్య & అక్షరాస్యత విభాగం కింద UDISE అనేది ఒక నేషనల్  డేటా ట్రాకింగ్ ప్రోగ్రాం. ఈ లెక్కలు 2016-17లో 29 వేల 427  నుండి 2% పెరుగుదలను చూపిస్తున్నాయి. అదే కాలంలో ప్రైవేట్ సెక్టార్ స్కూల్స్ సంఖ్య 12 వేల 573 నుండి 12 వేల 474కు కొద్దిగా(7%) తగ్గింది. 

కొద్దిరోజుల క్రితం ఇర్రామ్ మంజిల్ లో రూ.7.7 కోట్ల ఖర్చుతో ప్రభుత్వ స్కూల్ బాగు చేసి ప్రారంభించారు, ఇది ప్రభుత్వ స్కూల్స్ ఎలా ఉండోచ్చో చూపిస్తుంది. తెలంగాణలోని దాదాపు 81.21% స్కూల్స్ లోని క్లాస్ రూమ్స్ లో కంప్యూటర్లు ఉన్నాయి, జాతీయ సగటు 64.7%. అయితే, జాతీయ సగటు 63.5% తో పోలిస్తే 63.28% స్కూల్స్ లో ఇంటర్నెట్ సదుపాయం ఉంది, ఇది సమాజంలోని అన్ని వర్గాలలో మొబైల్ వినియోగం పెరిగినప్పటికీ ఇంటర్నెట్ కొరత ఇంకా ఉందని సూచిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ సంఖ్యను పెంచడంతో  టీచర్లను కూడా ఎక్కువగా నియమిస్తోంది. 2016-17లో 1,33,124 టీచర్లు ఉండగా   2024-25లో 1,54,956 టీచర్లు ఉన్నారు (16% పెరుగుదల). అయితే ప్రైవేట్ స్కూళ్లల్లో టీచర్ల సంఖ్య  మాత్రం 1,04,853 నుండి ఏకంగా  1,99,734 (90%)కు పెరిగింది. 

రాష్ట్రంలో విద్యార్థుల అడ్మిషన్లు 13% పెరిగి 65,73,100 నుండి 74,57,851కి చేరుకుంది. అయితే, ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకే   వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ల అడ్మిషన్లు 2016-17లో 35,13,147 నుండి 2024-25లో 47,52,424కి( 35%) పెరిగింది. అలాగే ప్రభుత్వ స్కూల్స్ లో 2016-17లో 28,88,637 నుండి 2024-25లో 26,29,488కి 8.9% తగ్గింది. 

కరోనా సమయంలో అడ్మిషన్లు  పరిగణనలోకి తీసుకుంటే ఈ తగ్గుదల మరింత తీవ్రంగా ఉంది. 2021-22లో కోవిడ్-19 ఆర్థిక మాంద్యం సృష్టించడంతో  తల్లిదండ్రులు ఫీజు కట్టలేక  ప్రైవేట్ స్కూల్స్ మూసివేయడంతో ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య 33,03,699కి పెరిగింది.

సానుకూల అంశం ఏమిటంటే, తెలంగాణలో ప్రాథమిక స్థాయి అంటే 1 నుంచి 5 క్లాసుల్లో పిల్లలందరూ బడిలో చేరారు (100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో- GER). ఆ తర్వాత 6 నుంచి 8 క్లాసుల్లో 92.6%, 9 నుండి 10 తరగతుల్లో 75.3%, ఇంటర్మీడియట్ స్థాయిలో 49% మంది పిల్లలు విద్య సంస్థల్లో  కొనసాగుతున్నారు.

తెలంగాణలో విద్యార్థి-టీచర్ నిష్పత్తి  (PTR) కూడా బాగుంది, ప్రాథమిక స్కూల్స్ లో ఒక్కో టీచర్‌కి 20 మంది విద్యార్థులు, ఉన్నత స్కూల్స్ లో 17 మంది, మాధ్యమిక స్కూల్స్ లో 15 మంది విద్యార్థులు ఉన్నారు, దీనివల్ల టీచర్లు పిల్లలపై బాగా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది.