సిటీ శివారు ప్రాంతాల చుట్టూ మెమూ రైళ్లు

సిటీ శివారు ప్రాంతాల చుట్టూ మెమూ రైళ్లు
  •     సికింద్రాబాద్ - ఉందానగర్, మేడ్చల్ - ఉందానగర్ మధ్య ట్రైన్లు
  •     రోజుకు 16 సర్వీసులు, మినిమం చార్జీ 10, మ్యాగ్జిమం రూ. 15

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ సిటీతోపాటు శివారు ప్రాంతాలను కలుపుతూ నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే మెమూ( మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైళ్లను తీసుకొచ్చింది. సికింద్రాబాద్ -– ఉందానగర్, మేడ్చల్ –- ఉందానగర్ మధ్య రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం 16 రైళ్లను నడిపిస్తుండగా, మరికొన్నింటిని పట్టాలెక్కించేందుకు ప్లాన్‌‌‌‌ చేస్తోంది. ఈ రైళ్లలో తక్కువ చార్జీలకే ప్రయాణానికి అవకాశం కల్పించింది. మినిమం టికెట్‌‌‌‌ ధర రూ. 10, మ్యాగ్జిమం రూ. 15.  ఇతర రవాణాలతో పోల్చితే మెమూ రైలు సర్వీసుల్లో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు సౌకర్యవంతంగా ఉండనుంది. ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో డిమాండ్‌‌‌‌కు తగ్గట్టుగా రైళ్ల సర్వీసులు అందించనున్నారు. సికింద్రాబాద్‌‌‌‌ నుంచి ఉందానగర్‌‌‌‌ వరకు టికెట్‌‌‌‌ ధర రూ.10, ఉందానగర్‌‌‌‌ నుంచి మేడ్చల్‌‌‌‌ వరకు రూ.15, మేడ్చల్‌‌‌‌ నుంచి సికింద్రాబాద్‌‌‌‌ వరకు రూ. 10గా నిర్ణయించారు. టికెట్లను కౌంటర్లు, డిజిటల్‌‌‌‌ విధానంలో కొనుక్కోవచ్చు. ఉదయం 6.15 నుంచి రాత్రి10.50 వరకు రైళ్లు నడుస్తాయి.  

రైళ్లు ఆగే స్టాప్​లివే..

సికింద్రాబాద్‌‌‌‌ – ఉందానగర్‌‌‌‌ –సికింద్రాబాద్‌‌‌‌ : సీతాఫల్‌‌‌‌మండి, ఆర్ట్స్‌‌‌‌ కాలేజీ, జామై ఉస్మానియా, విద్యానగర్‌‌‌‌, కాచిగూడ, మలక్‌‌‌‌పేట, డబిరపురా, యాకుత్‌‌‌‌పురా, ఉప్పుగూడా, ఫలక్‌‌‌‌నుమా, ఎన్‌‌‌‌పీఏ శివరాంపల్లి, బుద్వేల్‌‌‌‌.

ఉందానగర్‌‌‌‌ – మేడ్చల్‌‌‌‌ – ఉందానగర్‌‌‌‌ : బుద్వేల్‌‌‌‌, ఎన్‌‌‌‌పీఏ శివరాంపల్లి, ఫలక్‌‌‌‌నుమా, ఉప్పుగూడ, యాకుత్‌‌‌‌పురా, డబిర్‌‌‌‌పురా, మలక్‌‌‌‌పేట, కాచిగూడ, విద్యానగర్‌‌‌‌, జామై ఉస్మానియా, ఆర్ట్స్‌‌‌‌ కాలేజీ, సీతాఫల్‌‌‌‌మండి, మల్కాజిగిరి, దయానంద్‌‌‌‌ నగర్‌‌‌‌, సఫిల్‌‌‌‌గూడ, రామకిష్టాపురం గేట్‌‌‌‌, అమ్ముగూడ, కల్వారి బ్యారక్స్‌‌‌‌, అల్వాల్‌‌‌‌, బొలారం బజార్‌‌‌‌, బొలారం, గుండ్ల పోచంపల్లి, గౌడవల్లి. 

మేడ్చల్‌‌‌‌ –సికింద్రాబాద్‌‌‌‌ –మేడ్చల్‌‌‌‌ : గౌడవల్లి, గుండ్ల పోచంపల్లి, బొలారం, బొలారం బజార్‌‌‌‌, అల్వాల్‌‌‌‌, కల్వారి బ్యారక్స్‌‌‌‌, అమ్ముగూడ, రామకిష్టాపురం గేట్‌‌‌‌, సఫిల్‌‌‌‌గూడ, దయానంద్‌‌‌‌ నగర్‌‌‌‌, మల్కాజిగిరి.