లైఫ్ పార్ట్​నర్​ కోసం ఇలా వెతుకుతున్నారు

లైఫ్ పార్ట్​నర్​ కోసం ఇలా వెతుకుతున్నారు

డేటింగ్​ యాప్స్​, మ్యాట్రిమోనీ వెబ్​సైట్లు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్​ లైఫ్ పార్ట్​నర్​ని వెతుక్కోవడం ఈజీ అయింది.  జీవిత భాగస్వామిలో ఎలాంటి క్వాలిటీస్​ ఉండాలి? అనే విషయంలో ఈ కాలం  అబ్బాయిలు, అమ్మాయిల ఆలోచనలు  మారుతున్నాయి. చాలామంది ఆన్​లైన్​ చాటింగ్​చేసి, అవతలి వాళ్ల మీద ఒక అంచనాకి వస్తున్నారు. సొంతంగా డెసిషన్​ కూడా తీసుకుంటున్నారు. అంతేకాదు తమకి అన్ని విధాలా మ్యాచ్​ అయ్యే వ్యక్తి దొరికేంత వరకు కాంప్రమైజ్​ అవ్వట్లేదు. 
ముగ్గురిలో ఒక్కరు
“ఈ జనరేషన్​ వాళ్లలో 67 శాతం మంది డేటింగ్​ యాప్స్​ ద్వారానే తమకి సరైన జోడిని వెతుక్కుంటున్నారు. ఈరోజుల్లో అమెరికాలోని ప్రతి మూడు జంటల్లో ఒకరు డేటింగ్​ యాప్స్ ద్వారానే ఒక్కటవుతున్నారు. మనదేశంలో కూడా ఇదే తీరు కనిపిస్తోంది. ఆన్​లైన్​ డేటింగ్ సాయంతో తాము కోరుకున్న క్వాలిటీస్​ ఉన్న వ్యక్తిని కలుసుకునే అవకాశం పెరిగింది”అని చెబుతోంది ‘ఓకే క్యుపిడ్’ డేటింగ్​ యాప్​ సీనియర్​ మార్కెటింగ్​ మేనేజర్​ సితార మీనన్​. 
ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​తో
‘‘ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ సాయంతో  వారివారి ఇష్టాలు, ప్రిఫరెన్స్​కి సరిపోయే వ్యక్తిని వెతకడం మరింత సులువైంది. డేటింగ్​ యాప్​లో కోరుకునే వ్యక్తి  వయసు, ఎత్తు, ఎక్కడ ఉంటారు? ఎంత చదువుకున్నారు? ఎంత సంపాదిస్తున్నారు? వంటి వివరాలు చెబితే చాలు...మ్యాచ్​ అయిన అమ్మాయి లేదా అబ్బాయిల ప్రొఫైల్​ కనిపిస్తుంది”అంటున్నాడు ‘బెటర్​హాఫ్​.ఎఐ’ అనే డేటింగ్​ యాప్​ సిఇవో పవన్​ గుప్తా.