ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదులకు గ్రీవెన్స్ మాడ్యూల్

ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదులకు  గ్రీవెన్స్ మాడ్యూల్
  • ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో కంప్లైంట్ చేసే వెసులుబాటు కల్పించిన ఎస్ఈసీ

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో ఎన్ని కలను పారదర్శకంగా నిర్వహించడంతోపాటు ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం  ఈసారి సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. పౌరులు ఎన్నికల అక్రమాలపై సుల భంగా ఫిర్యాదు చేసేందుకు ‘గ్రీవెన్స్ మాడ్యూల్’ను ప్రారంభించింది.

 tsec.gov.in వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి హోమ్ పేజీలో ఉండే ‘గ్రీవెన్స్​ మాడ్యూల్​’ ఐకాన్‌‌‌‌‌‌‌‌ను క్లిక్ చేయాలి. ముందుగా తమ మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం తమ ఫిర్యాదును వివరంగా రాసి, అవసరమైతే ఆధారాలను అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయవచ్చు. ప్రజలు చురుకుగా పాల్గొనేలా చేయడమే ఈ మాడ్యూల్ ఉద్దేశమని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.