వంశీ రామ్ బిల్డర్స్పై రెండో రోజు ఐటీ రెయిడ్స్

వంశీ రామ్ బిల్డర్స్పై రెండో రోజు ఐటీ రెయిడ్స్

వంశీ రామ్ బిల్డర్స్పై రెండోరోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలో 36 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వంశీ రామ్ బిల్డర్స్ ఎండీ సుబ్బారెడ్డితో పాటు ఆయన బావ మరిది జనార్థన్ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వారితో పాటు కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు, సిబ్బంది ఇండ్లలోనూ రెయిడ్స్ జరుగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి గ్రీన్ పార్క్ హోటల్ ఛైర్మన్ మల్లిఖార్జున రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆవాస, గ్రీన్ పార్క్ హోటళ్లకు ఆయన ఛైర్మన్ గా ఉన్నారు. ఆయన బంధువుల నివాసాల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. లిటిగేషన్ లో ఉన్న స్థలాలు కొనుగోలు చేసి అక్రమ ప్రాజెక్టులు నిర్మించినట్లు వంశీ రామ్ బిల్డర్స్పై ఆరోపణలు ఉన్నాయి. వివిధ ప్రాజెక్ట్‌‌‌‌ల్లో కొనుగోళ్లు, అమ్మకాల్లో చేతులు మారిన నగదుకు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం సైతం ఐటీ శాఖ తెలంగాణ, ఏపీలోని 35 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌‌లో 15 ప్రాంతాలు, ఏపీలోని 20 ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా రెయిడ్స్ కొనసాగాయి. జూబ్లీహిల్స్‌‌‌‌ పెద్దమ్మ టెంపుల్‌‌‌‌ సమీపంలోని వంశీరామ్‌‌‌‌ బిల్డర్స్‌‌‌‌ కార్పొరేట్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ను అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అకౌంట్స్‌‌‌‌ సిబ్బందిని మినహా ఇతరులను ఆఫీసులోకి అనుమతించలేదు. నందగిరి హిల్స్‌‌‌‌లోని ఎండీ టి.సుబ్బారెడ్డి ఇంటితో పాటు బంజారాహిల్స్ రోడ్‌‌‌‌ నంబర్‌‌‌‌7లోని ఆయన బావమరిది టి.జనార్దన్‌‌‌‌రెడ్డి ఇల్లు, కంపెనీల డైరెక్టర్లు, సీఈవోల ఇండ్లు, ఆఫీస్‌‌‌‌ల్లో జరిగిన సోదాల్లో ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.