యువతి మిస్సింగ్.. 50 రోజులు గడిచినా దొరకని ఆచూకీ లేదు

యువతి మిస్సింగ్.. 50 రోజులు గడిచినా దొరకని ఆచూకీ లేదు

సికింద్రాబాద్లో అసిస్టెంట్ లోకో పైలట్ గా విధులు నిర్వర్తిస్తున్న వాసవి ప్రభ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. ఆమె అదృశ్యమై 50 రోజులు గడుస్తున్నా ఇంకా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వాసవి ప్రభ కోసం గాలిస్తున్నామని సనత్నగర్ సీఐ ముత్తు యాదవ్  చెప్పారు. ఆమె తన వెంట ఏటీఎం, సెల్ ఫోన్ తీసుకెళ్లకపోవడంతో ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారిందని అన్నారు. వాసవి ప్రభకు కాబోయే భర్తను సైతం ఇప్పటికి మూడు సార్లు ప్రశ్నించినట్లు చెప్పారు. వాసవి ప్రభ ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారమివ్వాలని సీఐ కోరారు. 

కాగా సికింద్రాబాద్లో లోకో పైలట్గా పనిచేస్తున్న వాసవి ప్రభ నవంబర్ 30న ఇంటి నుంచి వెళ్లి పోయింది. సంచిత్ సాయి అనే వ్యక్తితో ఆమె వివాహానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆమె అదృశ్యమైంది. దీంతో కాబోయే భర్తతో గొడవ కారణంగానే ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.