
తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఇప్పటికే గోల్కొండ బోనాలు ముగియగా సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతర నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు . జులై 13న సికింద్రాబాద్ ఉజ్జయిన మహంకాళి (లష్కర్) బోనాలు జరగనున్నాయి. ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. లక్షలాదిమంది భక్తులు తరలి వచ్చే అవకాశంతో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటోంది.
జులై 13వ తేదీ ఆదివారం మహంకాళి బోనాలకు ఉదయం 4.10 బ్రహ్మ ముహూర్తం లో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయ ధర్మకర్త కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. సోమవారం రోజు రంగం భవిష్యవాణి తో పాటు అమ్మవారి అంబారి ఊరేగింపు, ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి అమ్మవారి ఫలహర బండ్ల ఊరేగింపు ఉంటుంది.
అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం 6 క్యూలైన్ లు ఏర్పాటు చేశారు భక్తులు. బాట షోరూం నుంచి 2 , రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ నుంచి 2, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 2 క్యూలైన్లు ఉన్నాయి. క్యూ లైన్ లో 16 మీటర్లకు ఒక ఎమర్జెన్సీ గేట్ ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ బందోబస్తుతో పాటు 70 సీసీటీవి కెమెరాల నడుమ బోనాల జాతర జరగనుంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా, మొబైల్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఉదయం వేళల్లో రద్దీ ఉంటుంది కాబట్టి జోగినిలు, శివశక్తులకు దర్శనం చేసుకునేందుకు స్పెషల్ టైం కేటాయించారు. శివ శక్తులు, జోగినిల కోసం మధ్యాహ్నం 2గంటల నుంచి 4 గంటల వరకు సమయం కేటాయించారు.
►ALSO READ | వాహనాలన్నీ శ్రీశైలం వైపే.. నల్లమలలో భారీగా ట్రాఫిక్ జామ్.. మూడు గంటలకు పైగా రోడ్లపైనే..
మహంకాళి పీఎస్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. టెంపుల్ కు రెండు కిలోమీటర్ల నుంచి బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్స్ చేయనున్నారు. దాదాపు 1600 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్షల మంది బోనాల జాతకం వచ్చే అవకాశంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో బోనలా జాతర జరగనుంది. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా వాటర్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్స్, మినీ అబులెన్స్ ఏర్పాటు చేశారు.
గతేడాది తో పోల్చుకుంటే ఈసారి బోనాల జాతరకు ఎక్కువ మంది వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. వీఐపీ మూవ్మెంట్ ఎక్కువ ఉండే అవకాషం ఉండడంతో అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఆషాఢ మాసంలో 30లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో బోనాల జాతరకు మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో దాదాపు ఆర్టీసీ నుంచి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుండి 175 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ.