సికింద్రాబాద్ లో సంచలనం సృష్టించిన బీటెక్ స్టూడెంట్ హత్య కేసులో నిందితులను వదిలే ప్రసక్తే లేదని సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య తెలిపారు. సీతాఫల్ మండిలో నిందితుల ఇంటిని ముట్టడించారు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు . దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య అక్కడికి చేరుకుని మృతుడి బంధువులను అడ్డుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సముదాయించి నిందితుల ఇంటి వద్ద నుంచి బాధితులను, మీడియాను బయటకు పంపించారు.
ఈ సందర్బంగా మాట్లాడిన డీసీపీ చంద్రయ్య...మే 7న రాత్రి 9 గంటల సమయంలో యావన్ పై కొందరు యువకులు మూకుమ్ముడిగా కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో యావన్ కు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు. ప్రేమ వ్యవహారం కారణంగానే యావన్ పై దాడి చేశారని ప్రాథమికంగా నిర్ధారించాం. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు పరమేశ్, వంశీతో పాటు మరి కొందరు యువకులు యావన్ పై దాడి చేశారు. నిందితులను గుర్తించాం..టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నిందితులను ఐడెంటి ఫై చేశాం. ప్రేమ వ్యవహారం కారణంగానే హత్య జరిగింది. కొంత మందిని నిందితులను అదుపులోకి తీసుకున్నాం. మరికొంత మంది కోసం గాలిస్తున్నాం. ఇది పరువు హత్య కాదు..సుపారీ గ్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ లేనట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు త్వరలోనే మీడియాకు తెలియజేస్తాం.ఎంతటి వారు ఉన్నా వదిలే ప్రసక్తి లేదు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తాం అని స్పష్టం చేశారు
యావన్ హత్యతో సికింద్రాబాద్ లో ఇవాళ ఉదయం నుంచి హైటెన్షన్ నెలకొంది. మృతుడి బంధువులు,కుటుంబ సభ్యులు నిందితుల ఇంటిపై దాడి చేశారు. భారీగా చేరుకుని వారి ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు భారీగా చేరుకుని వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. బాధితుల దాడితో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో ఘటనా స్థలానికి చేరుకున్న సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అసలేం జరిగిందంటే..
తమకు సంబంధించిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, చెప్పినా వినడం లేదని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంజినీరింగ్స్టూడెంట్యవన్ ను మే 7న రాత్రి అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. అల్వాల్ ప్రాంతానికి చెందిన యవాన్ (25) ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. సీతాఫల్‌మండికి చెందిన ఓ యువతితో నాలుగేండ్లుగా ప్రేమలో ఉన్నాడు. సీతాఫల్మండి ఇందిరానగర్‌లో యవాన్కు ఫ్రెండ్స్ఉండడంతో వారిని కలిసేందుకు తరచూ వస్తుండేవాడు. తను ప్రేమించిన యువతిని కూడా కలుస్తూ ఉండేవాడు. ఈ ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న అమ్మాయి బంధువులు యావన్ కు పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు.
గురువారం యావన్ ఇందిరానగర్ లోని ఫ్రెండ్స్‌తో కలిసి అరుగుపై కూర్చుని క్రికెట్చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి బావ, సోదరుడు మరో ముగ్గురితో కలిసి కత్తులతో ఇందిరానగర్ వచ్చారు. క్రికెట్చూస్తున్న యావన్‌ను గొంతుతోపాటు పలుచోట్ల విచక్షణారహితంగా పొడిచారు. మొత్తం 17 చోట్ల పొడవడంతో తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడిపోయాడు. ఈ ఘటన అక్కడి సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. గమనించిన స్థానికులు గాంధీ దవాఖానకు తరలించగా, మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి, నిందితుల కోసం గాలిస్తున్నారు.
