గచ్చిబౌలి ఫ్లై ఓవర్ దగ్గర సెక్యూరిటీ గార్డు దారుణ హత్య

గచ్చిబౌలి ఫ్లై ఓవర్ దగ్గర  సెక్యూరిటీ గార్డు దారుణ హత్య

గచ్చిబౌలిలో దారుణం జరిగింది. ఫ్లై ఓవర్ దగ్గర  నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ లో  సెక్యూరిటీ గా పని చేస్తున్న దాసరి రాజు(58) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు.  కూకట్ పల్లి జగద్గిరిగుట్టలో  తన కుటుంబంతో నివాసం ఉంటూ గచ్చిబౌలిలో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నాడు  దాసరి రాజు.  సంవత్సరం నుంచి గచ్చిబౌలి లో శ్రీ గరుడ ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీగా పని చేస్తున్నాడు రాజు.  

జులై 7న  రాత్రి విధులు నిర్వహిస్తున్న సమయంలో అపార్ట్ మెంట్ లోని సెల్లార్ బీ3 లో రాజును ఇనుప రాడ్ తో దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు.  గచ్చిబౌలి పోలీసులు, డాగ్ స్వాడ్,క్లూస్ టీమ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి.  నిందితుల కోసం నాలుగు బృందాలుగా గాలిస్తున్నారు  గచ్చిబౌలి పోలీసులు.

►ALSO READ | గురు పౌర్ణమి బ్యానర్ కడుతుండగా కరెంట్ షాక్.. అక్కడికక్కడే వ్యక్తి మృతి