మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం..బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సఖి నివాస్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క

మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం..బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సఖి నివాస్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: ఉపాధి, ఉద్యోగాల కోసం సిటీకి వచ్చే మహిళలకు సురక్షితమైన వసతి కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లో నూతనంగా నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ సఖి నివాస్, వన్ స్టాప్ సెంటర్ సఖి కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే సుమారు150 మంది మహిళలకు ఇక్కడ బస కల్పిస్తున్నామని, చిన్న పిల్లలతో వచ్చే తల్లుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళల భద్రత, గౌరవం, ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, మహిళా అభ్యున్నతిని ఓర్చుకోలేక విమర్శలు చేసే విపక్షాలకు మహిళలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మహిళా కమిషన్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.