వీడియో: కేబుల్ బ్రిడ్జిపై షర్ట్ విప్పి సెల్ఫీలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

వీడియో: కేబుల్ బ్రిడ్జిపై షర్ట్ విప్పి సెల్ఫీలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

కేబుల్ బ్రిడ్జి పై షర్ట్ విప్పి సెల్ఫీలు

ముగ్గురు యువకుల అరెస్ట్ 

మాదాపూర్, వెలుగు : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై షర్ట్ విప్పి సెల్ఫీలు దిగుతున్న ముగ్గురు యువకులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఒంగోలుకు చెందిన శ్రీహరి, మహబూబ్​నగర్​ జిల్లా పెద్ద కొత్తపల్లి కి మర్క శేఖర్​, విజయవాడకు చెందిన ఆర్ అంకిరెడ్డి ఫ్రెండ్స్. బుధవారం అర్ధరాత్రి 1 గంట దాటాక జూబ్లీహిల్స్ నుంచి కేబుల్ బ్రిడ్జి మీదకు వెళ్లారు.  శ్రీహరి షర్ట్ విప్పి రోడ్డు మీద పడుకొని సెల్ఫీలు దిగటం స్టార్ట్ చేశాడు. అతని ఫోజులను ఫ్రెండ్ అంకిరెడ్డి ఫొటోలు తీశాడు.  వాకింగ్ ట్రాక్ లో శేఖర్ సెల్ఫీలు తీసుకుంటున్నాడు. సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు.

For More News..

పోలీసులను పరేషాన్ చేస్తున్న నకిలీ ఫేస్‌బుక్ ఐడీలు

నిజామాబాద్ ​ఎమ్మెల్సీ పోలింగ్​ ఇయ్యాల్నే

బీజేపీ కార్పొరేటర్ కు టీఆర్ఎస్ ఆఫర్‌​