సెల్ఫిష్ నుండి దిల్ ఖుష్ సాంగ్.. రింగ్ టోన్స్ తో మోతెక్కడం ఖాయం

సెల్ఫిష్ నుండి దిల్ ఖుష్ సాంగ్.. రింగ్ టోన్స్ తో మోతెక్కడం ఖాయం

రౌడీ బాయ్స్ హీరో ఆశిష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "సెల్ఫిష్". లవ్ టుడే ఫేమ్ ఇవానా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని.. కాశీ విశాల్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. యూత్ కి కనెక్ట్ అయ్యేలా లవ్ అండ్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథతో ఈ సినిమా రానుంది.

తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. దిల్ ఖుష్ అంటూ సాగే ఈ పాట ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది ఈ పాట. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. జావేద్ అలీ పాడాడు.

లిరికల్ వీడియోలో ఆశిష్ డాన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. స్టైలీష్ స్టెప్స్ ని చాలా ఈజ్ తో చేశాడు ఆశిష్. ట్రెడిషనల్ డాన్స్ తో ఇవానా కూడా అదరగొట్టింది. చూస్తుంటే.. ఈ మూవీతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు ఆశిష్. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.