కొట్టేసిన కార్లను ఓఎల్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌లో సేల్

కొట్టేసిన కార్లను ఓఎల్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌లో సేల్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కొట్టేసిన కార్లను ఓఎల్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌లో అమ్మకానికి పెట్టి..  వాటిని కొనుగోలు చేసి సేల్ చేసే అంతర్రాష్ట్ర ముఠా పట్టుబడింది. రూ.3.5కోట్లు విలువైన12 కార్లు స్వాధీనం చేసుకుని..10 మంది సభ్యుల ముఠాలో ఏడుగురిని సిటీ సీసీఎస్‌‌‌‌‌‌‌‌ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన కార్తీక్‌‌‌‌‌‌‌‌, లవణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ఓఎల్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌లో కార్లను కొనుగోలు చేసి సెకండ్స్‌‌‌‌‌‌‌‌లో అమ్ముతుంటారు.  ఇందుకు  ఓఎల్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌లో సెర్చ్‌‌‌‌‌‌‌‌ చేస్తుండేవారు. వీరికి బెంగళూరుకు చెందిన సయ్యద్‌‌‌‌‌‌‌‌, ఏపీలోని మదనపల్లికి చెందిన సైఫ్‌‌‌‌‌‌‌‌ అలీ ఖాన్‌‌‌‌‌‌‌‌, సోన్‌‌‌‌‌‌‌‌ పరిచయమై తమ వద్ద చోరీ చేసిన కార్లు ఉన్నాయని, తక్కువ ధరకు అమ్ముతామని చెప్పారు. దీంతో కార్తీక్, లవణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ షేక్ అబ్దుల్లా, మహ్మద్ ఫిరోజ్‌‌‌‌‌‌‌‌, షేక్ షహిద్‌‌‌‌‌‌‌‌, గంధి శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహ్మద్ తాసిఫ్‌‌‌‌‌‌‌‌తో కలిసి గ్యాంగ్ గా ఏర్పడ్డారు. బెంగళూరు, ఢిల్లీ గ్యాంగ్స్‌‌‌‌‌‌‌‌ చోరీ చేసిన కార్లను ఓఎల్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌లో అమ్మకానికి పెడితే.. వారి నుంచి కొనుగోలు చేసి బయట సెకండ్ సేల్స్‌‌‌‌‌‌‌‌ కింద అమ్మే దందా కొనసాగిస్తున్నారు.  

 డాక్యుమెంట్లు లేకుండానే..
 
డాక్యుమెంట్లు లేకుండా తక్కువ ధరకు కార్లను కొనుగోలు చేసే కస్టమర్లను ముందుగా కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యేవారు. ఓఎల్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌లో కార్లు కొనుగోలు చేసి కమీషన్స్‌‌‌‌‌‌‌‌తో బిజినెస్ చేస్తున్నట్లు నమ్మించేవారు. కస్టమర్లు డబ్బు చెల్లించేంత వరకు కారు నంబర్ ప్లేట్స్‌‌‌‌‌‌‌‌ లేకుండా చేసేవారు. ఇలా కండీషన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కార్లను కొనుగోలు చేసి సేల్‌‌‌‌‌‌‌‌ చేసేవారు. బుధవారం ఓ నంబర్ ప్లేట్‌‌‌‌‌‌‌‌లేని ఐ ట్వంటీ కారులో లవణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  బహదూర్ పురా క్రాస్ రోడ్స్‌‌‌‌‌‌‌‌ మీదుగా పురానాపూల్‌‌‌‌‌‌‌‌ వైపు వెళ్లేందుకు యత్నించాడు. లవణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ గుట్టు తెలిసింది.