Congress War Room Case : మల్లు రవికి సైబర్ క్రైం పోలీసుల నోటీసులు

Congress War Room Case : మల్లు రవికి సైబర్ క్రైం పోలీసుల నోటీసులు

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైం పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఉదయం కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్  సునీల్ కనుగోలును ప్రశ్నించిన అధికారులు తాజాగా పార్టీ సీనియర్ నేత మల్లు రవికి నోటీసులు జారీ చేశారు. వార్ రూం కేసులో విచారణకు రావాలంటూ సీఆర్పీసీ 41A కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు  హాజరుకావాలని ఆదేశించారు. 

మరోవైపు వార్ రూం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు సైబర్ క్రైం విచారణకు హాజరయ్యారు. గంట పాటు అధికారులు ఆయనను విచారించారు. విచారణ తర్వాత ఆయన సైబర్ క్రైం కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఉదయం 10:30 గంటలకు ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉండగా కాస్త ఆలస్యంగా సీసీఎస్ కు వచ్చారు. అనారోగ్యం కారణంగా ఆయన సైబర్ క్రైం విచారణకు హాజరుకాలేనని లేఖ రాసినట్లు ఉదయం వార్తలు వచ్చాయి. అయితే వాటికి తెరదించుతూ విచారణకు హాజరయ్యారు. 

సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంతో పాటు నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ సైబర్ క్రైం పోలీసులు కాంగ్రెస్ వార్ రూంలో సోదాలు నిర్వహించారు. ముగ్గుర సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలుకు సైబర్ క్రైం పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. వాటిని రద్దు చేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే సీసీఎస్ పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వలేమని ఈ నెల 3న హైకోర్టు తేల్చి చెప్పింది. 9న సైబర్ క్రైం విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఉత్తర్వులు జారీ చేసింది.