V6 News

అషురెడ్డి.. నన్నే కాదు..   ఎంతో మందిని ముంచింది.. సంచలన ఆడియో బయటపెట్టిన ధర్మేంద్ర

అషురెడ్డి.. నన్నే కాదు..   ఎంతో మందిని ముంచింది.. సంచలన ఆడియో బయటపెట్టిన ధర్మేంద్ర
  • ఆధారాలను పరిశీలించాకే పోలీసులు కేసు నమోదు చేసిన్రు
  • ఇచ్చిన ప్రతి రూపాయికి ఆధారాలు ఉన్నాయని వెల్లడి

బషీర్​బాగ్​,వెలుగు : బిగ్ బాస్ ఫేం, సినీనటి అషురెడ్డి అలియాస్ వెంకట అశ్విని రెడ్డిపై నమోదైన రూ. 9.35 కోట్ల భారీ మోసం కేసులో సీసీఎస్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఎన్నారై ధర్మేంద్ర నుంచి కోట్లాది రూపాయల నగదుతో పాటు బంగారం, ఆస్తులు కాజేసినట్లు బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. బాధితుడి తండ్రి సమర్పించిన నగదు లావాదేవీల పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో అషురెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులు వెంకటకృష్ణ, యశోద రెడ్డి, సోదరి దివ్వరెడ్డికి కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు.

కేసు పెట్టొద్దు అనుకున్నా.. కానీ: ధర్మేందర్

తాజాగా విడుదల చేసిన ఆడియోలో ధర్మేందర్ మాట్లాడుతూ.. “లీగల్​గా అషు రెడ్డిపై ముందుకు వెళ్తున్నాం. మొదట నాకు ఆమెపై కేసు పెట్టాలనే ఉద్దేశం లేదు. కానీ అషు రెడ్డి నాపై ఫేక్ కేసులు పెట్టి బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించింది. పరిస్థితి ఇక్కడితో ఆగదని భావించి మా నాన్న కేసు పెట్టాల్సి వచ్చింది.

పెండ్లి చేసుకుంటానని నమ్మించి గోల్డ్, ఫ్లాట్ కొనుగోలు చేయించింది. అందుకోసం నేను లోన్స్ తీసుకోవడంతో పాటు పరిచయస్తుల దగ్గర కూడా అప్పులు చేశాను. పెండ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పడంతో ఇచ్చిన డబ్బులు, ఆస్తులు తిరిగి ఇవ్వాలని అడిగితే మొదట ఇస్తానని చెప్పి, ఆ తర్వాత ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించింది.

నేను ఇచ్చిన ప్రతి రూపాయికీ ఆధారాలు ఉన్నాయి. ఆ అన్ని డాక్యుమెంట్లను పోలీసులకు అందజేశాం. పోలీసులు కూడా ఆధారాలను పరిశీలించిన తరువాతే కేసు నమోదు చేశారు. నన్నే కాదు.. ఇంకా చాలా మందిని అషు రెడ్డి మోసం చేసింది” అని ధర్మేందర్ ఆరోపించారు. చట్టపరంగా ఆమెపై పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.