
ముంబై : ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌కు ముందు స్టాక్ మార్కెట్ లాభపడింది. మళ్లీ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వమే వస్తుందనే అంచనాలతో స్టాక్ మార్కెట్ గరిష్ట స్థాయిలను తాకుతోన్న సంగతి తెలిసిందే. బీఎస్ ఈ సెన్సెక్స్ 140.41 పాయింట్లు లాభపడి 39,110.21 వద్ద, నిఫ్టీ 28.80 పాయింట్లు బలపడి 11,737.90 వద్ద క్లో జయ్యాయి. సెన్సెక్స్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ గా నిలిచింది. దాంతో పాటు సన్ ఫార్మా, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్ టెల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్ , ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు కూడా లాభపడ్డాయి.