
వెలుగు: వరుసగా 12 హత్యలు చేసిన సీరియల్ కిల్లర్‍ను మహబూబ్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నమ్మించి అమాయకుల ప్రాణాలు తీస్తున్న హంతకుడు పట్టుబడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చౌడాపూర్‍కు చెందిన యూసుఫ్ ప్రాంతాలను బట్టి పేర్లు మార్చుకుని తిరిగేవాడు. అమాయకులను నమ్మించి జనంలేని చోటికి తీసుకెళ్లి చంపి, దోచుకునేవాడు. 2003 నుంచి ఇప్పటివరకు 12 హత్యలు చేశాడని ఎస్పీ రెమారాజేశ్వరి తెలిపారు. యూసుఫ్‌కు మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం చొక్కంపేటకు చెందిన ఓ వివాహితతో సంబంధం ఉంది. ఇటీవల అదే గ్రామంలోని స్కూలు స్వీపర్ కటికె బాల్‍రాజ్ (52)ను హత్య చేశాడు.అనుమానంతో పోలీసులు అతన్ని విచారించగా.. వరుస హత్యల వివరాలను బయటపెట్టడంతో పోలీసులు నివ్వెరపోయారు.
గొర్రెలు ఇప్పిస్తామని…
తక్కువ ధరకు గొర్రెలిప్పిస్తానని బాల్‍రాజ్‍ను నమ్మించి యూసుఫ్ టీవీఎస్ మోపెడ్ నవాబ్ పేట్ మండలం కనుగకుచ్చ తండా దగ్గరకు తీసుకుపోయి కళ్లల్లో కారం కొట్టి..చంపేశాడు. గొర్రెలు కొనేందుకు బాలరాజు తెచ్చుకున్న రూ. 14 వేలు, సెల్ న్ ను తీసుకుని పరారయ్యాడు . బాల్‍రాజ్ హత్యలో యూసుఫ్‍తో పాటు ఆతనితో సంబంధం ఉన్న మహిళకూడా పాల్గొంది. కొందరు స్థానికులు ఇచ్చిన సమాచారంతో యూసుఫ్‍ను పట్టుకున్నారు. ఇటీవలే వికారాబాద్‍లో ఓ హత్య కేసులో అరెస్ట్ అయిన యూసుఫ్ జైలుకు వెళ్లి వచ్చాడు . జడ్చర్ల, రాజేం ద్రనగర్ పోలీస్టేషన్ లలో చోరీ కేసుల్లోనూ అరెస్ట్ అయ్యాడు . అతని నుంచి మూడు సెల్ న్ లు, 2వేల 5వందల నగదు, నాలుగు బైకులను స్వాధీనం
చేసుకున్నారు.