స్పుత్నిక్‌‌‌‌ వీ తయారీకి పర్మిషన్‌‌‌‌ ఇవ్వండి

స్పుత్నిక్‌‌‌‌ వీ తయారీకి పర్మిషన్‌‌‌‌ ఇవ్వండి

డీసీజీఐకి సీరం ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ అప్లికేషన్‌‌‌‌
న్యూఢిల్లీ: రష్యా డెవలప్‌‌‌‌ చేసిన స్పుత్నిక్‌‌‌‌ వీ వ్యాక్సిన్‌‌‌‌ను ఉత్పత్తి చేసేందుకు సీరం ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా రెడీ అవుతోంది. ఇందుకోసం డ్రగ్స్‌‌‌‌ కంట్రోలర్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా (డీసీజీఐ) అనుమతికి దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. స్పుత్నిక్‌‌‌‌-వి వ్యాక్సిన్ల ప్రయోగ ఫలితాల ఫలితాల అనాలిసిస్‌‌‌‌కు పర్మిషన్‌‌‌‌ అడిగినట్టు సమాచారం. అలాగే జూన్‌‌‌‌ నుంచి ప్రతి నెలా 10 కోట్ల కొవిషీల్డ్‌‌‌‌ టీకాలను ఉత్పత్తి చేయాలని కంపెనీ ప్లాన్‌‌‌‌ చేస్తోంది. నోవొవ్యాక్స్‌‌‌‌కు చెందిన వ్యాక్సిన్‌‌‌‌ను ఇప్పటికే సీరం ఉత్పత్తి చేస్తోంది. దీనికి అమెరికా నుంచి అనుమతి రావాల్సి ఉంది. ప్రస్తుతం స్పుత్నిక్​-వీ టీకాలను దేశంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌‌‌‌ తయారు చేస్తోంది. రష్యా నుంచి కూడా టీకాలు దిగుమతి అవుతున్నాయి. ఇటీవల 30 లక్షల డోసులు హైదరాబాద్‌‌‌‌కు చేరుకున్నాయి.
అందరికీ ఒకే రూల్‌‌‌‌ ఉండాలె
ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం విధానాన్ని సీరం ఇన్​స్టిట్యూట్ తప్పుపట్టింది. వ్యాక్సిన్ తయారు చేసేవాళ్లందరికీ ఒకేవిధమైన రూల్స్‌‌‌‌ ఉండాలంది. తమ టీకా వేసుకున్నోళ్లకు ఏదైనా జరగరానిది జరిగితే న్యాయపరమైన సమస్యల్లేకుండా చూసుకోవాలని ఆ కంపెనీలు చెప్పడం, ఈ విషయంలో ఇండెమ్నిటీ బాండ్ ఇవ్వాలన్న కండీషన్‌‌‌‌కు కేంద్రం దాదాపు ఓకే చెప్పడంతో సీరం సీఈవో అదర్ పూనావాలా గురువారం స్పందించారు. ‘చట్టపరమైన భద్రత విషయంలో విదేశీ కంపెనీలకు సెక్యూరిటీ ఇస్తే మా కంపెనీతో పాటు దేశంలోని వ్యాక్సిన్ తయారీ కంపెనీలన్నింటికీ అదే రూల్ వర్తింపజేయాలి’ అన్నారు.