హైదరాబాద్ లో పెరుగుతున్న సెట్విన్ బస్సులు

హైదరాబాద్ లో పెరుగుతున్న  సెట్విన్ బస్సులు

హైదరాబాద్ సిటీలో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. ప్రత్యామ్నాయంగా ఆటోలతో పాటు సెట్విన్ బస్సులను నమ్ముకుంటున్నారు. గతంతో పోలిస్తే సిటీలో సెట్విన్ సర్వీస్ ల సంఖ్య పెరిగాయి. కోవిడ్ పరిస్థితులు ముగిశాక.... షాపులు, అన్నిఆఫీసులు తెరుచుకోవడంతో రోడ్లపై జనం రద్దీ పెరిగింది.  హైదరాబాద్ లో ఈ రష్ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. వివిధ పనుల కోసం వెళ్లే వారికి బస్సులు ఏమాత్రం సరిపోవడం లేదు. రద్దీ ప్రాంతాల్లోనూ ఆర్టీసీ బస్సుల్లేక జనం ప్రైవేట్ ట్రాన్స్ పోర్టును ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ లో ఆటోలతో పాటు సెట్విన్ బస్సుల సంఖ్య పెరిగింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఏర్పడిన సెట్విన్ సంస్థ...మొదట్లో కొన్ని బస్సులే నడిపించింది. ఇప్పుడు రద్ధీగా ఉండే మెహిదీపట్నం, సికింద్రాబాద్, బోరబండ ఏరియాల్లో భారీ సంఖ్యలో తిరుగుతున్నాయి. ఎంత ట్రాఫిక్ ఉన్నాఆర్టీసీ బస్టాపుల్లోనే ఆపి ప్రయాణీకులను ఎక్కించుకుంటున్నారు సెట్విన్ బస్ డ్రైవర్లు.  
  
సెట్విన్ బస్సులు హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో గతంలో చిన్న సైజ్ బస్సులు ఉండగా... ఇప్పుడు పెద్ద సైజ్ వి కనిపిస్తున్నాయి. ఆర్టీసీ చార్జీలు పెరగడంతో పాటు... అవసరమైన చోట ఆపుతారని చాలామంది ప్రయాణీకులు సెట్విన్ బస్సులనే ఎక్కుతున్నారు. పీక్ టైంలో బస్సులు తిప్పుతూ.. మైక్ పెట్టి పిలిచి మరీ ప్రయాణీకులను ఎక్కించుకుంటున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సాయంత్రం వేళల్లో ప్రయాణీకులకు రోడ్డు దాటడం, బస్సు కోసం వెయిట్ చేయడం ఇబ్బందిగా మారింది. దాంతో స్టూడెంట్స్, ఉద్యోగులు ఆర్టీసీ బస్సుల కోసం ఆగకుండా సెట్విన్ ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీకి ఆదాయం తగ్గిపోయి ఇబ్బంది పడుతుంటే... సెట్విన్ సర్వీసులతో మరింత నష్టం వస్తోందని అంటోంది ఆర్టీసీ యాజమాన్యం. సెట్విన్ బస్సుల ఫిట్ నెస్ సరిగా ఉండవనీ...ప్రభుత్వం వాటిని ఎంకరేజ్ చేయొద్దంటున్నారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. 

మరిన్ని వార్తల కోసం...

ముగ్గురు వ్యాపారవేత్తలకు రాజ్యసభ సీట్లు

ఎస్సీ ఉప కులాలకు చట్ట సభల్లో అవకాశమివ్వాలె