ముగ్గురు వ్యాపారవేత్తలకు రాజ్యసభ సీట్లు

ముగ్గురు వ్యాపారవేత్తలకు రాజ్యసభ సీట్లు

హైదరాబాద్ : TRS రాజ్యసభ అభ్యర్థులుగా.. దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, హెటిరో పార్థసారధి రెడ్డిని ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. సీఎం క్యాంప్ ఆఫీస్ లో పార్టీ నేతలతో డిస్కషన్ చేసిన తర్వాత ముగ్గురు అభ్యర్థులను ఫైనల్ చేశారు కేసీఆర్. బండా ప్రకాశ్ రాజీనామాతో ఒక సీటు ఖాళీ అయింది. డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీ కాలం ముగియడంతో మరో రెండ్లు సీట్లు ఖాళీ అయ్యాయి. సంఖ్యా బలం ఉండటంతో ఈ మూడు రాజ్యసభ సీట్లు TRSకే దక్కనున్నాయి. బండ ప్రకాశ్ రాజీనామాతో అయిన సీటుకు రేపటిలోగా, మిగతా రెండు సీట్లకు ఈ నెల 24లోపు నామినేషన్ వేయాలి. 

మరిన్ని వార్తల కోసం
కరీంనగర్​లో నీళ్ల గోస నిజమే

లండన్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం