జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల పీఎస్పరిధిలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులను శనివారం ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ మల్లేశ్కథనం ప్రకారం.. గాజులరామారం, హెచ్ఏఎల్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో ఏడుగురు బంగ్లాదేశీయులు పాస్‌పోర్టు, వీసాలు లేకుండా 2 నెలలుగా నివాసముంటున్నట్లు సమాచారం తెలిసిందన్నారు.
దాడులు నిర్వహించి వారిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. దేశంలోకి వారు అక్రమంగా ప్రవేశించినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఏడుగురిని జోగిపేటలోని డిపోర్టేషన్సెంటర్కి తరలించినట్లుచెప్పారు. విచారణ అనంతరం వారిని బంగ్లాదేశ్‌కి పంపనున్నట్లు సీఐ తెలిపారు.
