ప్యాసింజర్ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. ఏడుగురు మృతి

ప్యాసింజర్ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. ఏడుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున సంభల్ జిల్లాలోని ధనారి బస్‌స్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. మరో 25 మంది గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

సంభల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ చక్రేశ్ మిశ్రా మాట్లాడుతూ.. ‘తెల్లవారుజామున ట్యాంకర్ మరియు బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చు. మాకు సమాచారం వచ్చిన వెంటనే.. జిల్లా మేజిస్ట్రేట్‌తో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని ఆయన తెలిపారు.

ఈ ప్రమాదంపై యూపీ సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సంభల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం తెలిపారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

For More News..

27వ బర్త్‌డే జరుపుకున్న వరల్డ్స్ షార్టెస్ట్ ఉమెన్‌

కోవిడ్ రూల్స్ పాటించని 59 లక్షల వాహనాలకు చలాన్లు

9 మందిని చంపి.. శరీరాన్ని ముక్కలు చేసి కూలర్‌లో నింపిన ట్విట్టర్ కిల్లర్‌కు ఉరిశిక్ష

వీడియో: క్యాచ్ మిస్ చేశాడని స్టేడియంలోనే కొట్టినంత పనిచేసిన కెప్టెన్