దేశంలోని పలు ఎయిర్ పోర్టులకు బాంబ్ బెదిరింపు కలకలం రేపుతోంది. ఢిల్లీ, పాట్నా, జైపూర్, కోయంబత్తూరుతో పాటు వడోదరా ఎయిర్ పోర్టులకు బాంబ్ బెదిరింపు వచ్చింది. ఎయిర్ పోర్టులను పేల్చేస్తామంటూ దుండగులు ఈమెయిల్స్ పంపుతున్నారు. దీంతో ఎయిర్ పోర్టుల్లో తనిఖీలు చేపట్టారు బాంబ్ స్క్వాడ్స్. భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రయాణికులను క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బాంబ్ బెదిరింపులతో పలు విమానాలు ఆలస్యం అయ్యాయి.
ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) నుంచి బయలుదేరాల్సిన దుబాయ్ విమానానికి బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. దీంతో చెన్నై-దుబాయ్ ఎమిరేట్స్ విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.
బీహార్‌లోని పాట్నా విమానాశ్రయానికి జూన్ 18న బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. దీంతో పాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను పెంచినట్లు పాట్నా ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. సమాచారం ప్రకారం, జూన్ 18న మధ్యాహ్నం 1:10 గంటలకు, పాట్నా ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్‌కి బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. వెంటనే విమానాశ్రయ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలు చేపట్టారు.
బాంబ్ బెదిరింపుతో ఇవాళ తెల్లవారుజామున చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 286 మంది ప్రయాణికులతో దుబాయ్‌కి బయలుదేరే విమానం ఆలస్యం అయిందని పోలీసులు తెలిపారు. విమానంలో బాంబు ఉన్నట్లు ఇమెయిల్ వచ్చిన తర్వాత భద్రతాదళాలు ఉదయం 10.30 గంటలకు బయలుదేరాల్సిన విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయని తెలిపారు. తనిఖీలో బూటకపు బెదిరింపు అని తేలిందని వెల్లడించారు.
#WATCH | Rajasthan's Jaipur International Airport received bomb threat mail today; Visuals from outside the airport pic.twitter.com/OxOogagwqB
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 18, 2024
