కేసీఆర్ తెలంగాణ ప్రజల డబ్బుల్ని ఇతర రాష్ట్రాల్లో పంచిండు:షబ్బీర్ అలీ

కేసీఆర్ తెలంగాణ ప్రజల డబ్బుల్ని ఇతర రాష్ట్రాల్లో పంచిండు:షబ్బీర్ అలీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజల డబ్బును కేసీఆర్​ ఇతర రాష్ట్రాల్లో పంచారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. గాంధీ భవన్​లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 16 కార్పొరేషన్ల ఏర్పాటు అభినందనీయమని, కాంగ్రెస్​ సర్కా రు అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. కార్పొరేషన్లకు కేబినెట్​ఆమోదం తెలిపిందని, త్వరలో గైడ్​లైన్స్ ఖరారు చేస్తామని చెప్పారు. కేసీఆర్ భాష గురించి దేశమంతా తెలుసని, బయట, అసెంబ్లీలో, కౌన్సిల్​లో కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని చెప్పా రు.  ము స్లిం రిజర్వేషన్లను తొలగించే దమ్ము మోదీ, అమిత్​ షాకు లేదన్నారు.

15న ఎల్బీ స్టేడియంలో సీఎం ఇఫ్తార్ విందు

రంజాన్ మాసంలో తొలి శుక్రవారం 15వ తేదీన ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. దీనికి సీఎం రేవంత్​రెడ్డి ముఖ్య అతిథిగా, మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. విందు నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సంబంధిత అధికారులతో కలసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులకు అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.