- మంత్రి వాకిటి శ్రీహరి
షాద్నగర్, వెలుగు: షాద్నగర్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.583 కోట్లను మంజూరు చేసిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆదివారం షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుతో మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు సాధన కోసం గతంలో ఎన్నోసార్లు ధర్నాలు, ఉద్యమాలు నిర్వహించామని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇది సాధ్యం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చొరవతో ఈ కల సాకారమవుతోందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు భస్మం, వైస్ చైర్మన్ అందె మోహన్ పాల్గొన్నారు.
