కృష్ణంరాజు కథతో జవాన్.. కాపీ కథకే ఇంత బిల్డప్పా?

కృష్ణంరాజు కథతో జవాన్.. కాపీ కథకే ఇంత బిల్డప్పా?

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ "జవాన్" కథ కాపీనా? అది కూడా ఒకటి కాదు రెండు సినిమాల నుండి ఈ సినిమాని కాపీ చేశారట. దీనికి సంబందించిన న్యూస్ ఒకటి హల్చల్ చేస్తోంది. తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ జూన్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది.

నిజానికి ఈ సినిమా అఫ్పీషియల్ స్టార్ట్ అయినప్పుడే ఈ కథపై కాపీ రూమర్స్ వచ్చాయి. తమిళ నిర్మాత మాణిక్యం నారాయణన్.. ఈ సినిమా కథ తనదని, అట్లీ తన కథని కాపీ చేశాడని ఆరోపించారు. 2006లో విజయకాంత్ హీరోగా నటించిన తమిళ చిత్రం 'పేరరసు'ని కాపీ చేసాడని అట్లీపై ఫిర్యాదు చేసాడు. అంతేకాదు.. 1985లో విడుదలైన "ఓరు ఖెదీయిన్ డైరీ" కథ కూడా సేమ్ అదే కథ అని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. తన భార్య ను చంపి తనను జైలు పాలు చేసిన వారిపై హీరో ఎలా పగతీర్చుకున్నాడు అనే కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. 

షారూఖ్ ఈ సినిమాలో తండ్రికొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. మరి పాతచింతకాయ పచ్చడిలా అనిపిస్తున్న ఈ సినిమా ఇప్పటి జనాలకు ఎంత వరకు నచ్చుతుందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.