Shah Rukh Khan: చేతిలో గన్, ఒళ్లంతా రక్తం.. 'కింగ్'గా షారుఖ్ ఖాన్ రౌద్రరూపం పోస్టర్ రిలీజ్

Shah Rukh Khan: చేతిలో గన్, ఒళ్లంతా రక్తం.. 'కింగ్'గా షారుఖ్ ఖాన్ రౌద్రరూపం  పోస్టర్ రిలీజ్

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన 61వ జన్మదిన వేడుకలకు ముందే అభిమానులకు మైండ్ బ్లాకింగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కింగ్' (King) నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ రౌద్రరూప పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇది ఈ మూవీపై ఫ్యాన్స్ లో ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. 

దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న 'కింగ్'లో షారుఖ్ ఖాన్ సరికొత్త, రఫ్ అండ్ రా అవతార్‌లో కనిపిస్తున్నారు.  ఈ పోస్టర్‌లో మండుతున్న నిప్పుల గుండం, చేతిలో గన్, రక్తంతో తడిసిన ఛాతీతో షారుఖ్ కనిపిస్తున్న తీరు చూస్తుంటే... వెండితెరపై మాస్ విధ్వంసం ఖాయమనిపిస్తోంది. "ఆజ్ ఫిర్ యాద్ ఆయా... ఖాతిల్ నహీ... ఆషిక్ హూ..." అంటూ ఎస్‌ఆర్‌కే ఇచ్చిన క్యాప్షన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.

'పఠాన్''తో అఖండ విజయాన్ని అందించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ (VFX), పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షారుఖ్ స్వయంగా పాల్గొంటున్నారు. ఇటీవల అభిమానులతో  'X' వేదికగా ఇంటరాక్షన్‌లో సినిమా అప్‌డేట్స్ పంచుకుంటూ... "క్రిస్మస్ రేసులో మిగతా సినిమాలు బ్రెడ్ ముక్కలైతే, మా 'కింగ్' మధ్యలో ఉండే టేస్టీ టిక్కీ" అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశారు.

అరిజిత్ సింగ్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అంతేకాకుండా, ఈ సినిమాలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్‌తో పాటు అభిషేక్ బచ్చన్, దీపికా పడుకోణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  రాణీ ముఖర్జీ, కరీనా కపూర్ ఖాన్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. కింగ్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి...

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)