కింగ్ ఖాన్ .. 60ఏళ్ల అభిమాని ఆఖరి కోరిక నెరవేర్చిన షారుఖ్

కింగ్ ఖాన్ .. 60ఏళ్ల అభిమాని ఆఖరి కోరిక నెరవేర్చిన షారుఖ్

బాలీవుడ్ ఇండస్ట్రీని శాసించడమే కాకుండా కోట్లాది మంది హృదయాలను దోచుకున్న బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కింగ్ ఆఫ్ హార్ట్స్ అని మరోసారి నిరూపించుకున్నాడు. షారుఖ్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉందని, ఈ సూపర్ స్టార్ ఎప్పుడూ తన హృదయపూర్వక హావభావాలతో అభిమానులపై ప్రేమను చూపుతారని అందరికీ తెలిసిన విషయమే. 'కింగ్ ఖాన్' చూసేందుకు అతని అభిమానులు ఎప్పుడూ ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు.

షారుఖ్ అభిమాని అయిన 60 ఏళ్ల క్యాన్సర్ రోగి తన జీవితంలో కనీసం ఒక్కసారైనా అతన్ని కలవాలని కోరికను వ్యక్తం చేసింది. అంతే.. అభిమాని కోరిక నెరవేర్చడం కోసం ఆయన నిజంగానే ఆమెను కలుసుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 60 ఏళ్ల SRK అభిమాని శివాని చక్రవర్తి టెర్మినల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం, శివాని కుమార్తె ప్రియా చక్రవర్తి సోషల్ మీడియాలో ఆమె తల్లిని సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో షారుఖ్‌ను కలవాలనే తన తల్లి చివరి కోరిక గురించి చెప్పింది. దాని కోసం ఆమెకు సహాయం చేయమని నెటిజన్లను అభ్యర్థించింది. ఈ క్లిప్ వేగంగా వైరల్ అయ్యి..  అభిమానుల ద్వారా షారుఖ్ కు చేరింది.

మే 22, సోమవారం రాత్రి 30 నిమిషాలకు పైగా వీడియో కాల్ ద్వారా ఆమెతో మాట్లాడిన షారుఖ్..  ఆ వెటరన్ లేడీ చివరి కోరికను నెరవేర్చాడు. కల్ హో నా హో నటుడు తాను జాయ్ నగరాన్ని సందర్శించినప్పుడు ఆమెను కలుస్తానని, ఆమెకు ఆర్థిక సహాయం అందజేస్తానని, ఆమె కుమార్తె ప్రియా వివాహానికి వస్తానని కూడా వాగ్దానం చేశాడు. తనకు ఎముకలు లేకుండా చేపల కూర వండమని సూపర్ స్టార్ శివానిని అభ్యర్థించాడు.

షారూఖ్ తన అభిమానుల కోసం ఇలా చేయడం అనేది ఇదేం మొదటిసారి కాదు, అంతకుముందు 2017 లో క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమాని అరుణ పికెకి షారుక్ ఖాన్ రికార్డ్ చేసిన వీడియో సందేశాన్ని పంపాడు. ఆ తర్వాత ఫోన్ చేసి మాట్లాడారు, అది జరిగిన కొన్ని రోజులకు ఆ వ్యక్తి మరణించాడు. .

ఇక షారుఖ్ సినిమా విషయాలకొస్తే అట్లీ జవాన్‌లో ఆయన కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల సెప్టెంబర్ 7కి వాయిదా పడిగా.. సూపర్ స్టార్ సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కాగా ఇది ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న షారుఖ్ ఖాన్ మూడో చిత్రం. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన డుంకీ లోనూ షారుఖ్ నటించనున్నారు. అతను చివరిగా బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ పఠాన్‌లో కనిపించాడు.

https://twitter.com/masrur2srk/status/1660890964150607873