IND vs PAK: ఆదివారం ఏం జరుగుతుందో చూద్దాం.. సూర్య కామెంట్స్‌పై స్పంచిందిన షహీన్ అఫ్రిది

IND vs PAK: ఆదివారం ఏం జరుగుతుందో చూద్దాం.. సూర్య కామెంట్స్‌పై స్పంచిందిన షహీన్ అఫ్రిది

ఆసియా కప్ సూపర్-4 లో భాగంగా టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి దాయాధి దేశంపై మరోసారి మరోసారి ఆధిపత్యం చూపించింది. గతంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాటిక్ అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండేది. కానీ ప్రస్తుత పాకిస్థాన్ జట్టును చూసుకుంటే ఇండియాకు అసలు పోటీనే కాదని స్పష్టంగా అర్ధమవుతోంది. సూపర్-4 లో విజయం సాధించిన తర్వాత  ఇండియా–పాకిస్తాన్‌‌  క్రికెట్‌‌ మ్యాచ్‌‌లను ఇకపై రైవల్రీ (పోటాపోటీ సాగే వైరం)తో పోల్చడం ఆపాలని టీమిండియా కెప్టెన్‌‌ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.       

పాకిస్థాన్ మ్యాచ్‌‌లో ఇండియానే పూర్తి ఆధిపత్యం చూపిస్తోందని చెప్పాడు. ఇండియా చేతిలో పదే పదే ఓడుతున్న పాకిస్తాన్‌‌తో అసలు తమకు పోటీనే లేదని, అలాంటప్పుడు రైవల్రీ ప్రస్తావన అనవసరం సూర్య పాకిస్థాన్ జట్టును తీసి పడేశాడు. సూర్య వ్యాఖ్యలపై తాజాగా పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది స్పందించాడు. సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోనని తెలిపాడు. అఫ్రిది మాట్లాడుతూ.. " అది సూర్య అభిప్రాయం. అతను చెప్పనివ్వండి. ఈ టోర్నీలో జరిగే ఆసియా కప్ ఫైనల్‌కు పాకిస్థాన్, ఇండియా వస్తే ఏమి జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతం మా లక్ష్యం ఆసియా కప్ గెలవడమే. టైటిల్ కోసం మేము మా వంతు కృషి చేస్తాము". అని షాహీన్ అన్నాడు. 

►ALSO READ | IND vs BAN: 15 బంతుల్లో 10 పరుగులే.. శాంసన్ కంటే అక్షర్ ఎక్కువయ్యడా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏం జరుగుతుంది

ఇండియా– పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 15 టీ20  మ్యాచ్‌‌లు ఆడితే టీమిండియా ఏకంగా12 సార్లు విజయం సాధించింది. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు వారు రెండుసార్లు తలపెడితే రెండు సార్లు ఇండియానే గెలిచింది. ప్రస్తుతం ఆసియా కప్ లో రెండు జట్లు ఆసియా కప్ లో ఫైనల్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సూపర్-4లో బంగ్లాదేశ్ తమ చివరి రెండు మ్యాచ్ లు ఓడిపోతే ఇండియా- పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 28 న ఫైనల్ జరగుతుంది.   

ఆసియా కప్‌‌లో వారం వ్యవధిలోనే రెండుసార్లు తలపడ్డ చిరకాల ప్రత్యర్థుల సమరంలో రెండోసారి కూడా ఇండియా పైచేయి సాధించింది. గ్రూప్ దశలో ఒకసారి దాయాది దేశాన్ని చిత్తు చేసిన టీమిండియా.. గ్రూప్-4 దశలో ఇంకోసారి కసితీరా కొట్టేసింది. ఆదివారం (సెప్టెంబర్ 21) జరిగిన సూపర్‌‌‌‌–4 మ్యాచ్‌‌లో ఇండియా 6 వికెట్ల తేడాతో పాక్‎పై ఘన విజయం సాధించింది. ఒకవేళ రెండు జట్లు ఫైనల్ కు వస్తే ఎవరు గెలుస్తారో చూడాలి.