షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి జంటగా రూపొందుతున్న యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఓ రోమియో’. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నానా పటేకర్, అవినాష్ తివారి, దిశా పటాని, తమన్నా, ఫరిదా జలాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విక్రాంత్ మస్సే స్పెషల్ అప్పీయరెన్స్ ఇస్తున్నారు.
బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోహీరోయిన్లు షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి, నానా పటేకర్ తదితరులు పాల్గొన్నారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌కు ప్రేమకథను మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.
ట్రైలర్‌లో రక్తపాతం, హింస ప్రధానంగా కనిపించాయి. షాహిద్ కపూర్ మునుపెన్నడూ లేనంత వైల్డ్ లుక్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేశాడు. కమినే, హైదర్, రంగూన్ చిత్రాల తర్వాత షాహిద్–విశాల్ భరద్వాజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
