మహిళా దినోత్సవం రోజే మహిళా ప్రజాప్రతినిధికి అవమానం

మహిళా దినోత్సవం రోజే మహిళా ప్రజాప్రతినిధికి అవమానం

మహిళా దినోత్సవం రోజే ఓ మహిళా ప్రజాప్రతినిధికి అవమానం జరిగింది. జగిత్యాల జిల్లాలో మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో ఓ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత హాజరయ్యారు. వీరు స్టేజీ మీద ఉండగా స్థానిక మహిళా ఎంపీపీ, జడ్పీటీసీలను వేదికపైకి ఆహ్వనించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా.. మంత్రులు కూర్చొని ఉంటే.. పక్కనే ధర్మపురి మున్సిపల్ చైర్మన్ సంగి సత్తమ్మ కుర్చీల్లేక నిలబడటం చర్చనీయాంశంగా మారింది. మహిళా దినోత్సవానికి వచ్చి మహిళా ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వకపోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.