అమ్మపల్లి ఆలయంలో హుండీ చోరీ.. శంషాబాద్ మండలంలో ఘటన

అమ్మపల్లి ఆలయంలో హుండీ చోరీ.. శంషాబాద్ మండలంలో ఘటన

గండిపేట, వెలుగు: శంషాబాద్ మండల పరిధిలోని అమ్మపల్లి శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయంలో హుండీ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ మండల పరిధిలోని నర్కూడలోని అమ్మపల్లి దేవాలయంలో 26న రాత్రి 7 గంటలకు పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆలయం మూసివేశారు. 

తిరిగి 27వ తేదీ ఉదయం 5 గంటలకు వెళ్లి చూడగా రెండు తలుపుల తాళాలు పగిలిపోయి అక్కడ ఉన్న చిన్న హుండీ కనిపించకుండాపోయింది. చూడగా, మండప సమీపంలో పగిలిపోయి ఖాళీగా పడి కనిపించింది. అందులోని నగదు కనిపించలేదు. దొంగలు తలుపులను పగలగొట్టి హుండీ చోరీ చేశారని శంషాబాద్ రూరల్​పీఎస్​లో ఫిర్యాదు చేశారు సీఐ కె నరేందర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.