
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీవెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలు సోమవారం ముగిశాయి. చివరి రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు, స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్, మైలార్తీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండాల్లో నడిచేందుకు భక్తులు పోటీపడ్డారు. కూచిపూడి, భరతనాట్యం, వేంకటేశ్వరస్వామి వేషధారణతో చిన్నారులు
ఆకట్టుకున్నారు.