రాజీనామాను వెనక్కి తీసుకున్న శరద్ పవార్

రాజీనామాను వెనక్కి తీసుకున్న శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన  శరద్ పవార్ తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.  కార్యకర్తల డిమాండ్ మేరకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా శరద్ పవార్ వెల్లడించారు. తాను కార్యకర్తల మనోభావాలను అగౌరవపరచలేనని, వారి  ప్రేమ కారణంగా తన  రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లుగా పవార్ తెలిపారు.  

భవిష్యత్తులో తాను పార్టీలో సంస్థాగత మార్పులు, కొత్త బాధ్యతలు అప్పగించడం, కొత్త నాయకత్వాన్ని సృష్టించడంపై దృష్టి సారిస్తానని పవార్  తెలిపారు. పార్టీఅభివృద్ధి,  సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తాను తీవ్రంగా కృషి చేస్తానన్నారు. ఈ సమయంలో తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు, నేతలకు తాను ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానని పవార్ అన్నారు.

శరద్ పవార్ తన రాజీనామాను ఉపసంహరించుకోవడంతో ముంబైలోని YB చవాన్ సెంటర్ వెలుపల కార్యకర్తలు  సంబరాలు జరుపుకున్నారు. కాగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా మూడు రోజుల క్రితం శరద్ పవార్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కార్యకర్తు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు.