V6 News

ఇదెక్కడి దిక్కుమాలిన స్ట్రాటజీ.. ముంబై టీంపై ఫ్యాన్స్ ఫైర్.. శార్దూల్ను ఇంపాక్ట్ ప్లేయర్గా అసలు ఎందుకు తీసుకున్నట్టు..!

ఇదెక్కడి దిక్కుమాలిన స్ట్రాటజీ.. ముంబై టీంపై ఫ్యాన్స్ ఫైర్.. శార్దూల్ను ఇంపాక్ట్ ప్లేయర్గా అసలు ఎందుకు తీసుకున్నట్టు..!

శార్దూల్ను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుని బ్యాటింగ్, బౌలింగ్ ఇవ్వకపోవడంపై విమర్శలు చేస్తున్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన స్ట్రాటజీ అని ముంబై టీంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం.. ఒక జట్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆటగాడిని మరొకరితో మార్చుకోవచ్చు. అంటే.. బ్యాటర్ స్థానంలో బౌలర్‌ను లేదా బౌలర్ స్థానంలో బ్యాటర్‌ను తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రూల్ వాడుకుని బౌలింగ్ సమయంలో గానీ, బ్యాటింగ్ సమయంలో గానీ టీమ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ను బరిలోకి దించుతాయి.

సింపుల్గా చెప్పాలంటే.. జట్టుకు అవసరమైన సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ ఆపద్బాంధవుడు. బుధవారం SRH, MI జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఈ రూల్ ప్రకారం.. ముంబై ఇండియన్స్ జట్టు ఇంపాక్ట్ ప్లేయర్గా శార్దూల్ ఠాకూర్ను ముంబై రంగంలోకి దింపింది. కానీ.. బ్యాటింగ్కు గానీ, బౌలింగ్కు గానీ శార్దూల్ ను వాడుకోలేదు. అలాంటప్పుడు.. ఈ ఆల్ రౌండర్ను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుని ఉపయోగం ఏంటని ముంబై ఇండియన్స్ వైఖరిపై అభిమానులు మండిపడ్డారు. సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముంబై బౌలర్లను సన్ రైజర్స్ బ్యాటర్లు ఘోరంగా ఆడుకున్న సంగతి తెలిసిందే. బుమ్రాతో సహా ఏ బౌలర్ కూడా సన్ రైజర్స్ బ్యాటర్ల విధ్వంసానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. ముంబై బౌలర్ ఘజన్‌‌‌‌ఫర్‌ బ్యాక్ టూ బ్యాక్ వికెట్లు తీసినప్పటికీ ఆ తర్వాత క్లాసెన్‌‌‌‌, నితీశ్‌ నిలకడగా రాణించడంతో ముంబై ఓటమి ఖాయమైంది. శార్దూల్తో బౌలింగ్ చేయించి ఉంటే ముంబైకి ఎంతో కొంత కలిసొచ్చి ఉండేదని ముంబై అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా ముంబై కెప్టెన్ హార్థిక్ పాండ్యాపై దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి.

ALSO READ : గిదేం పని పరాగ్.. డ్రెస్సింగ్ రూమ్‌‌‌‌‌‌‌‌లో ఈ–సిగరెట్ తాగిన రాజస్తాన్ కెప్టెన్‌‌‌‌

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం సాగిందిలా..
244 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన హైదరాబాద్‌‌‌‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. సిక్స్‌‌‌‌తో ఇన్నింగ్స్‌‌‌‌ను ప్రారంభించిన అభిషేక్‌‌‌‌.. బుమ్రాకు 6, 4తో స్వాగతం పలికాడు. బౌల్ట్‌‌‌‌ వేసిన మూడో ఓవర్‌‌‌‌లో మూడు సిక్స్‌‌‌‌లు బాదిన హెడ్‌‌‌‌  క్యాచ్‌‌‌‌ ఔట్‌‌‌‌ నుంచి బయటపడ్డాడు. తర్వాతి  ఓవర్‌‌‌‌లోనూ 6, 4 కొట్టాడు. ఇదే ఓవర్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ 4, 4తో 19 రన్స్‌‌‌‌ వచ్చాయి. 

ఐదో ఓవర్‌‌‌‌లో చెరో ఫోర్‌‌‌‌, ఆరో ఓవర్‌‌‌‌లో హెడ్‌‌‌‌ రెండు ఫోర్లు, అభిషేక్‌‌‌‌ సిక్స్‌‌‌‌తో పవర్‌‌‌‌ప్లేలో ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌హెచ్‌‌‌‌ 92/0 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌‌‌‌లో హెడ్‌‌‌‌ 4, 6, 6, 4తో 23 రన్స్‌‌‌‌ రాబట్టాడు. ఈ క్రమంలో 20 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. 8వ ఓవర్‌‌‌‌లో హెడ్‌‌‌‌ సిక్స్‌‌‌‌ కొట్టినా.. తర్వాతి ఓవర్‌‌‌‌లో ఘజన్‌‌‌‌ఫర్‌‌‌‌ (2/51) వరుస బాల్స్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌ చేసి డబుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చాడు. తొలి వికెట్‌‌‌‌కు 129 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగియగా స్కోరు 129/2గా మారింది.

10వ ఓవర్‌‌‌‌లో పాండ్యా (1/39) ఓ సూపర్‌‌‌‌ బాల్‌‌‌‌తో హెడ్‌‌‌‌ను బోల్తా కొట్టించాడు. చివరి 12 బాల్స్‌‌‌‌లో 8 రన్స్‌‌‌‌ ఇచ్చి  మూడు కీలక వికెట్లు తీసి ముంబై మళ్లీ రేసులోకి వచ్చింది. 133/3తో ఇబ్బందుల్లో పడిన ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌హెచ్‌‌‌‌ను క్లాసెన్‌‌‌‌, నితీశ్‌‌‌‌ (21) ఆదుకునే బాధ్యత తీసుకున్నారు. 11వ ఓవర్‌‌‌‌లో నితీశ్‌‌‌‌ 4, క్లాసెన్‌‌‌‌ 4, 6తో స్కోరు 150/3కి చేరింది. 

12వ ఓవర్‌‌‌‌లో క్లాసెన్‌‌‌‌ 4, 4, 4, 4 తర్వాతి ఓవర్లలో 4, 6 బాదాడు. ఈ క్రమంలో 22 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ కొట్టిన క్లాసెన్‌‌‌‌ 6, 4 దంచాడు. 17వ ఓవర్‌‌‌‌లో నితీశ్‌‌‌‌ ఔట్‌‌‌‌ కావడంతో నాలుగో వికెట్‌‌‌‌కు 80 రన్స్‌‌‌‌ జతయ్యాయి. ఇక 19 బాల్స్‌‌‌‌లో 25 రన్స్‌‌‌‌ కావాల్సిన దశలో క్లాసెన్‌‌‌‌ 4, సలీల్‌‌‌‌ అరోరా (30 నాటౌట్‌‌‌‌) 6, 4, 6, 6తో ఈజీగా విజయాన్ని అందించాడు.