ముల్లన్‌పూర్: ఐపీఎల్‌లో టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన రాజస్తాన్ రాయల్స్ ఫుల్ జోష్‌లో ఉండగా.. ఆ టీమ్ కెప్టెన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాత్రం కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో అతను ఈ-సిగరెట్ తాగుతూ (వేపింగ్) టీవీ కెమెరాలకు చిక్కడమే ఇందుకు కారణం. 2019లోనే ఈ-సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
కానీ, రియాన్ ఈ–సిగరెట్ వాడటమే కాకుండా.. ఏకంగా డ్రెస్సింగ్ రూమ్‌లోనే దాన్ని ఉపయోగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా, కెమెరాల నిఘా ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో పరాగ్ ఇలాంటి పని చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల ప్రైవసీ గురించి గతంలో కెప్టెన్ల సమావేశంలో చర్చ జరిగినప్పటికీ, ఒక క్రికెటర్‌గా పరాగ్ సమాజానికి తప్పుడు సందేశం ఇస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి.

