
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ నుంచి నిరుద్యోగుల ఓదార్పు యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం ఆమె గన్ పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులుర్పించిన అనంతరం గజ్వేల్‌కు వెళ్లనున్నారు. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు దాటినా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావట్లేదని.. యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న క్రమంలో ఈ యాత్ర చేయాలని నిర్ణయించారు. గజ్వేల్‌లో పర్యటించి ఉద్యోగ నియామకాల్లేక ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలను పరామర్శించనున్నారు.