
సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)నా.. శర్వానందా(Sharvanand).. ఇద్దరిలో ఎవరు? చిరంజీవి(Chiranjeevi) తరువాతి సినిమా కోసం ఇద్దరు యంగ్ హీరోలపై చర్చ. దానికి చర్చ ఎందుకు. చిరుతో సినిమా అంటే ఎవరు కాదంటారని చాలా మందే అనుకుంటారు. కానీ గత నెలరోజులుగా ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి తన తరువాతి సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కురసాల(Kalyan Krishna kurasala)తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇందుకోసం మరో రీమేక్ ను సిద్ధం చేసుకున్నారు. అదే మలయాళంలో మోహన్ లాల్(Mohan lal), పృథ్విరాజ్ సుకుమారన్(Prudviraj sukumaran) కాంబోలో వచ్చిన బ్రో డాడీ(Bro Daddy) మూవీ. ఈ సినిమాలో మోహన్ లాల్, పృథ్విరాజ్ తండ్రీ కొడుకులుగా కనిపిస్తారు. అందుకే ఈ సినిమలో చిరంజీవి కొడుకుగా చేసే పాత్ర కోసం వెతుకుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ పాత్ర కోసం స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ పేరు బలంగా వినిపించింది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నారంతా. అనూహ్యంగా ఆ లిస్టులోకి మరో యంగ్ హీరో శర్వానంద్ వచ్చారు. బ్రో డాడీ సినిమాలో చిరు కొడుకు పాత్ర కోసం శర్వా పేరును కూడా పరిశీలిస్తున్నారట మేకర్స్.
నిజానికి సిద్దు జొన్నలగడ్డ కూడా ఈ రీమేక్ లో నటించడానికి అంత సుముకంగా లేడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. కెరీర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న సమయంలో రీమేక్ లు చేసి రిస్క్ తీసుకోవాలనుకోవడంలేదట సిద్దు. అందుకే ఈ సినిమా లిస్ట్ నుండి సిద్దు అవుట్ అయ్యి శర్వా ఇన్ అయ్యాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిరు అంటే శర్వాకు కూడా చాలా ఇష్టం. హిట్టు ఫ్లాప్ తో సంబంధంలేకుండా చిరంజీవితో యాక్ట్ చేసే అవకాశం వస్తే వదులుకోడు శర్వా. కాబట్టి ఈ ప్రాజెక్టులో శర్వా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యాడనే చెప్పొచ్చు. అయినప్పటికీ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండక తప్పదు.