Shashank Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్ ఫీల్డర్ శశాంక్ సింగ్ మరోసారి ఈజీ క్యాచ్‌ను వదిలేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బౌండరీ లైన్ దగ్గర అత్యంత సులువైన క్యాచ్‌ను శశాంక్ జారవిడచడంతో అభిమానులు సోషల్ మీడియాలో మీమ్స్‌తో మండిపడుతున్నారు.
Shashank Singh in this IPL #PBKSvsDC pic.twitter.com/MCTwCrBql2
— Sunil The Cricketer (@1sInto2s) April 25, 2026
కోచ్ ఆగ్రహం:
గతంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా శశాంక్ సింగ్ క్యాచ్‌లు వదిలేయడంతో హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను రివర్స్ కప్ పద్ధతిలో పట్టబోయి శశాంక్ విఫలమయ్యాడు. ఆ బంతి ఫోర్ వెళ్లడంతో పంజాబ్ కో–-ఓనర్ ప్రీతీ జింటా కూడా తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. గత 6 క్యాచ్‌లలో శశాంక్ 5 క్యాచ్‌లను జారవిడిచాడు. గత మ్యాచ్‌లో రికీ పాంటింగ్ నుంచి తప్పించేందుకు శశాంక్ సింగ్ ముఖాన్ని తన క్యాప్‌తో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సరదాగా కవర్ చేయడం గమనార్హం. మ్యాచ్ అనంతరం పాంటింగ్ అతడిని ఓదార్చినప్పటికీ, వరుసగా క్యాచ్ లు డ్రాప్ చేయడం జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తున్నాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
Shashank Singh hands in Punjab
— Venky Mama (@venkymama100) April 25, 2026
Ball in Himachal Pradesh
Dropped a sitter pic.twitter.com/9cRake0QUF
సోషల్ మీడియాలో రియాక్షన్స్:
శశాంక్ సింగ్ ఫీల్డింగ్ వైఫల్యాలపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. గత రెండు మ్యాచ్‌లలో 4 క్యాచ్‌లు డ్రాప్ చేశాడు.. ఫీల్డింగ్‌లో శశాంక్ మైండ్‌సెట్ సరిగ్గా లేనట్టుంది! అని ఒక వినియోగదారుడు కామెంట్ చేయగా.. "శశాంక్ సింగ్ చేతులు పంజాబ్‌లో ఉంటే, బంతి హిమాచల్ ప్రదేశ్‌లో పడుతోంది అంటూ మరొకరు ఎద్దేవా చేశారు.
Last match - 3 dropped
— VIKAS (@Vikas662005) April 25, 2026
Today match - 1 dropped
Shashank Singh dropped 4 catches from last match. pic.twitter.com/UT5aEazy59

