హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శిఖాగోయల్ చార్జ్‌‌‌‌

హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శిఖాగోయల్ చార్జ్‌‌‌‌
  • ఏసీబీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా అవినాశ్ మహంతి  బాధ్యతలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా డీజీ శిఖాగోయల్‌‌‌‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అదనంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌‌‌‌గా, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీస్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కొనసాగించనున్నారు. ఈ క్రమంలోనే హోంశాఖ పరిధిలోని పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ వంటి విభాగాలను శిఖాగోయల్‌‌‌‌ పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హోంశాఖ పరిధిలోని విభాగాలను మరింత బలోపేతం చేయాడమే తన లక్ష్యమని తెలిపారు.

సంబంధిత విభాగాధిపతులు, ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో పని చేయనున్నట్లు వెల్లడించారు. ఇటీవల బదిలీ అయిన అధికారులు వారివారి పోస్టింగ్‌‌‌‌లో ఛార్జ్‌‌‌‌ తీసుకున్నారు.  ఏసీబీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా అవినాశ్ మహంతి, విజిలెన్స్ అండ్ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌డీజీ డీఎస్ చౌహాన్‌‌‌‌, మల్కాజ్‌‌‌‌గిరి పోలీస్ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా బి.సుమతి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ సీపీగా తురుణ్ జోషి, మల్టీజోన్‌‌‌‌–II  ఐజీపీగా శహనవాజ్ ఖాసిమ్‌‌‌‌ బాధ్యతలు చేపట్టారు. కమిషనరేట్‌‌‌‌లోని హెచ్‌‌‌‌ఓడీలతో సమావేశాలు నిర్వహించారు.