మళ్లీ ప్రేమలో పడిన టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌ శిఖర్‌ ధవన్‌

మళ్లీ  ప్రేమలో పడిన టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌ శిఖర్‌ ధవన్‌

ముంబై: టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌ శిఖర్‌‌‌‌‌‌‌‌ ధవన్‌ మళ్లీ  ప్రేమలో పడ్డాడు. ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో తాను ప్రేమలో ఉన్నానని వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను షేర్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ‘నా హృదయం’ అనే క్యాప్షన్‌తో ఎమోజీని జత చేశాడు. చాంపియన్స్‌‌‌‌‌‌‌ ట్రోఫీ టైమ్‌‌లోనే ఈ ఫొటో వైరల్‌‌‌‌‌‌‌‌గా మారినా ధవన్‌‌‌‌‌‌‌‌ అప్పట్లో ఖండించాడు. కానీ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో యాంకర్‌‌‌‌‌‌‌‌ మళ్లీ దాని గురించి అడిగాడు. మొదట వ్యతిరేకించినా తర్వాత మెల్లగా బయటపెట్టాడు. ‘నేను ఏ పేరు తీసుకోను. ఈ గదిలో అత్యంత అందమైన అమ్మాయి నా స్నేహితురాలు’ అని సోఫీని పరిచయం చేశాడు.