
న్యూఢిల్లీ: ఏ మ్యాచ్‌లోనైనా తాను పేసర్లను అద్భుతంగా ఎదుర్కొంటానని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ స్పష్టం చేశాడు. కానీ పేసర్ వేసే ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌ను మాత్రం ఫేస్ చేయనని చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తాను భయపడతానని రోహిత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నాడు. ‘రోహిత్ కామెంట్స్‌ను నేను ఆమోదించను. పేస్ బౌలర్ల కాదు.. పేసర్ వేసే ఫస్ట్ బాల్‌ను ఎదుర్కోను. ప్రతి ఒక్కరికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఓపెనర్‌గా నాకూ కొన్ని వ్యూస్ ఉన్నాయి. ఎనిమిదేళ్లుగా ఓపెనింగ్ చేస్తున్నా. ఏనాడూ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడలేదు. ఒకవేళ ఫస్ట్ ఓవర్‌లో తప్పించుకున్నా.. సెకండ్ ఓవర్‌లోనైనా ఆడాల్సిందే కదా. కానీ పృథ్వీ షాతో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెట్టాల్సినప్పుడు. నేను స్ట్రయిక్ తీసుకోక తప్పదు. ఎందుకంటే ఫస్ట్ బాల్‌ను ఎదుర్కోవడానికి కుర్రాళ్లు అంత అనుకూలంగా ఉండరు. అదే రోహిత్ ఉంటే నేను స్ట్రయిక్ తీసుకోను’ అనిచెప్పాడు.