- స్టేకు హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్, వెలుగు: మాజీ డీజీపీ శివధర్‌రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారుగా ప్రభుత్వం చేపట్టిన నియామకంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సంబంధిత జీవో 1339పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా శివధర్‌రెడ్డిని డీజీపీగా నియమించడంతో ధనగోపాల్‌రావు కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఇది పెండింగ్‌లో ఉండగా ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ మధ్యంతర పిటిషన్ వేశారు. దీనిపై గురువారం జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పదవీ విరమణ చేసిన అధికారులను ఓఎస్‌డీలుగా నియమించడం ప్రభుత్వ నిర్ణయమని, ఇందులో కోర్టుల జోక్యం ఉండదంటూ విచారణను జూన్ 26కు వాయిదా వేశారు.
