
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లా రెడ్డికి భారీ షాక్ తగిలింది. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 లో ఉన్న 33 గుంటల స్థలం మల్లారెడ్డి కాదని రెవిన్యూ అధికారులు తేల్చారు. మేడ్చల్ కోర్టుకు నివేదిక అందజేశారు. సైబరాబాద్ పోలీసులకు సర్వే రిపోర్ట్ పంపించారు. కానీ మల్లారెడ్డి మాత్రం దశాబ్ద కాలంగా అది తన భూమి అంటున్నారు. సర్వే నెంబర్ 82లో ఉన్న ల్యాండ్ పై 15 బాధితులు అభ్యంతరం తెలిపేసరికి తతంగం మొత్తం బయటకొచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే
హైదరాబాద్ లోని సుచిత్ర ఏరియాలో రూ.వందల కోట్లు విలువ చేసే 2 .10 ఎకరాల భూమిపై వివాదం నడుస్తుండగా, అది మొత్తం తనదేనంటూ మల్లారెడ్డి మే 18న అక్కడ హంగామా చేశారు. తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, అనుచరులతో కలిసి వెళ్లి వివాదాస్పద స్థలంలో ఉన్న ఫెన్సింగ్ ను తొలగించారు. అప్పటికే అక్కడ మరో వర్గం ఉండడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. .
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డితో పాటు మరో వర్గానికి చెందినోళ్లను అదుపులోకి తీసుకున్నారు. కేసులు నమోదు చేశారు. రంగంలోకి రెవెన్యూ శాఖ దిగి విచారణ చేపట్టింది. రెవెన్యూ శాఖ చేసిన దర్యాప్తులో 33 గుంటల భూమి తనదికాదని తేలింది. దీంతో ల్యాండ్ పై ఉన్న మరో వర్గం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డిపై చర్య తీసకోవాలని కోరుతున్నారు.