మహబూబాబాద్ రూరల్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భవానీనగర్ తండాలో ఓ వ్యక్తిని భార్య, కొడుకు కలిసి హత్య చేశారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న పసందుల చంద్రయ్య(55)కు మంగళవారం భార్య విజయలక్ష్మి, కొడుకు వీరాచారితో గొడవ జరిగింది. ఈ క్రమంలో వారు ఆగ్రహంతో చంద్రయ్య గొంతు నులిమి హత్య చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
