శనివారం రాత్రి సమయం..షోలే పాట వినిపిస్తోంది..మ్యూజిక్కు అనుగుణంగా క్లబ్ డ్యాన్సర్ స్టెప్పులు.. ప్రేక్షకుల ఊర్రూతలు.. ఇంతలో పైను నిప్పులు వాన.. ఏంజరిగిందో తెలియక అక్కడున్న వారంతా షాక్ ..పైకి చూస్తే మంటలు..భయంతో పరుగులు..అకస్మాత్తుగా మంటలు చెలరేగినపుడు గోవా నైట్ క్లబ్ దృశ్యాలు నెట్టింట వీడియో వైరల్ అవుతున్నాయి.
కిక్కిరిసిన నైట్ క్లబ్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగినప్పుడు క్లబ్ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తున్నట్లు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. మంటలు వ్యాపిస్తుండటంతో ఒక్కసారిగా మ్యూజిక్ అగిపోయింది.. మంటలు చెలరేగాయి (ఆగ్ లగ్ గయీ) డ్యాన్సర్, నైట్ క్లబ్ సిబ్బంది, టూరిస్టులు పరుగులు పెట్టడం, భయంతో ప్రాణాలు కాపాడుకునేందుకు తోసుకుంటూ వెళుతుండటం వీడియోలో కనిపించింది.
శనివారం రాత్రి జరిగిన ఈ అగ్నిప్రమాదంలో నలుగురు టూరిస్టులు 14 మంది సిబ్బంది సహా 25 మంది మృతి చెందారు. ఆరుగురు గాయపడి చికిత్స పొందుతున్నారని గోవా పోలీసులు తెలిపారు. ఏడుగురు బాధితుల వివరాలు దొరకలేదని చెప్పారు. క్లబ్ మేనేజర్ ను అరెస్ట్ చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు ,అగ్నిమాపక అధికారులు అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టారు. ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.
ఈ ప్రమాదం లో మరణించిన వారికుటుంబాలకు సంతాపం తెలిపారు ప్రధాని మోదీ. మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రకటించారు. రూ .2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.
