
టంపా(యూఎస్): అమెరికాలోని ఫ్లోరిడాలో రెండు గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, 18 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున వైబొర్సిటీ ప్రాంతంలోని ఈస్ట్సెవెన్త్ఎవెన్యూలోని 1600వ బ్లాక్లో జరిగింది. అనేక బార్‌లు, క్లబ్‌లు ఉన్న ఈ ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయని గాయపడినట్లు టంపా పోలీసులు వెల్లడించారు.
ఈ కాల్పుల వెనుక ఇద్దరు షూటర్ల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం మైన్ రాష్ట్రంలోని లెవిస్టన్లో ఓ దండగుడు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందడంతోపాటు 60 మంది గాయపడ్డారు.