ఆర్మూర్‌లో నా మీద పోటీ చెయ్..చిత్తుగా ఓడిస్తా: జీవన్ రెడ్డి

ఆర్మూర్‌లో నా మీద పోటీ చెయ్..చిత్తుగా ఓడిస్తా: జీవన్ రెడ్డి

ఎంపీ అర్వింద్ ఒక ఫేక్, ఫ్రాడ్ ఎంపీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కామెంట్ చేశారు. అర్వింద్ కుటుంబం అవినీతి కుటుంబమని, ఎంపీ అర్వింద్ ని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో బట్టలు ఊడదీసి, ఉరికిచ్చి  కొడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి కవిత, కేసీఆర్ లమీద మాట్లాడితే దాడులు చేస్తమని స్పష్టం చేశారు. గతంలోనే ఆర్మూర్ లో నిన్ను కొట్టారని, బాండ్ పేపర్ రాసి జిల్లా ప్రజలను మోసం చేశారని చెప్పారు. ఎంపీగా జిల్లాకు అర్వింద్ చేసింది ఏం లేదన్న ఆయన..టీఆర్ఎస్ జోలికి వస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు. అర్వింద్ వి మాటలే, చేతలు లేవన్నారు. 

గవర్నర్ తీరు సరిగా లేదని జీవన్ రెడ్డి తెలిపారు. రాజ్ భవన్ ను బీజేపీ మహిళా మోర్చా కార్యాలయంగా గవర్నర్ మార్చారని ఆరోపించారు. గవర్నర్ అంబేడ్కర్ రాజ్యాంగానికి వ్యతిరేఖంగా ప్రవర్తిస్తున్నారన్నారు. అర్వింద్ యాక్సిడెంటల్ ఎంపీ అన్న ఆయన.. దమ్ముంటే ఆర్మూర్ లో నా మీద పోటీ చేయు, చిత్తుగా ఓడిస్తానని ఛాలెంజ్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ని విడదీసి వారింట్లో బీజేపీ చిచ్చుపెట్టిందని చెప్పారు. డీఎస్, అర్వింద్ ఇద్దరు అవినీతిపరులని విమర్శించారు. లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ని లాగే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వ రంగ విచారణ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. అర్వింద్ ని జిల్లాలో తిరగనివ్వమని, ఎక్కడికక్కడ దాడులు చేస్తామని మండిపడ్డారు.